
Huzurabad by poll: ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళితే విజయం తథ్యం
పీసీసీ జూమ్ సమావేశంలో అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను జనంలోకి తీసుకెళితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం తథ్యమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రధానంగా విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ఇతర ప్రజావ్యతిరేక కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తెరాస, భాజపాల దిల్లీ దోస్త్, గల్లీ కుస్తీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. సమావేశంలో జగ్గారెడ్డి, మల్లురవి, బల్మూరి వెంకట్‌లతో పాటు 80 మంది నియోజకవర్గ, మండల, గ్రామ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.