JP Nadda: ఏపీలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం: జేపీ నడ్డా

ఏపీలో రాజకీయ పరిణామాలపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించినట్టు ఆ పార్టీ నేత సుజనా చౌదరి తెలిపారు.

Updated : 13 Oct 2023 20:21 IST

దిల్లీ: ఏపీలో రాజకీయ పరిణామాలపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించినట్టు ఆ పార్టీ నేత సుజనా చౌదరి తెలిపారు. శుక్రవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు వెనుక భాజపా పాత్ర ఉందని వైకాపా దుష్ప్రచారం చేస్తోందన్నారు. వైకాపా చేస్తోన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని నడ్డా సూచించారని తెలిపారు. రాష్ట్రంలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని నడ్డా చెప్పారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో భాజపా అనుసరించాల్సిన వ్యూహంపై కూడా పార్టీ అధ్యక్షుడితో చర్చించినట్టు సుజనాచౌదరి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని