Sujana chowdary: అవినీతిపరుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి: సుజనా చౌదరి

ఏపీలో అవినీతిపరులు, అక్రమార్కులు రాజ్యమేలుతున్నారని, వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. వైకాపా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భాజపా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో శుక్రవారం ‘ప్రజా పోరు’ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Published : 30 Sep 2022 22:05 IST

గుడివాడ గ్రామీణం: ఏపీలో అవినీతిపరులు, అక్రమార్కులు రాజ్యమేలుతున్నారని, వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. వైకాపా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భాజపా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో శుక్రవారం ‘ప్రజా పోరు’ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇసుక మాఫియా, లిక్కర్, గంజాయి, ల్యాండ్‌, మైనింగ్‌ మాఫియాలు రాజ్యమేలుతున్నాయన్నారు. కులమతాల కుమ్మలాటలు సృష్టించి మంత్రులు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. పోయేకాలం వచ్చింది కాబట్టే ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చారని దుయ్యబట్టారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్టీఆర్‌ పేరును హెల్త్‌ యూనివర్సిటీ నుంచి ఇన్నేళ్ల తర్వాత తొలగించడం ఆయన్ను అవమానించడమేనన్నారు. భావితరాలకు ఏమీ మిగల్చకుండా దోచుకుంటున్న వైకాపా నాయకుల్ని ఓటే వజ్రాయుధంగా చేసుకొని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పరిపాలన పక్కన పెట్టి పబ్జీ ఆడుకునే జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని