Punjab congress: పంజాబ్‌ సీఎంగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా!

పంజాబ్‌ తదుపరి ముఖ్యమంత్రిగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా నియమితులుకానున్నారు

Updated : 19 Sep 2021 15:40 IST

చండీగఢ్‌: పంజాబ్‌ తదుపరి ముఖ్యమంత్రిగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా నియమితులుకానున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనవైపే మొగ్గు చూపడంతో అధిష్ఠానంతో చర్చించి ఏఐసీసీ నియమించిన పరిశీలకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామా నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడనుంది. తొలుత పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌, ప్రతాప్‌ సింగ్‌ బజ్వా, మాజీ సీఎం రాజేందర్‌ కౌర్‌ భట్టల్‌ పేర్లు కూడా వినిపించినప్పటికీ.. అదృష్టం సుఖ్‌జిందర్‌నే వరించినట్లు తెలిసింది.

సుఖ్‌జిందర్‌ సింగ్‌ 1959లో ఏప్రిల్‌ 25న జన్మించారు. ప్రస్తుతం డేరా బాబా నానక్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫతేఘర్‌ చురైన్‌ నుంచి 2002లో తొలిసారి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2012, 2017 ఎన్నికల్లో డేరాబాబా నానక్‌ నుంచి విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని