Raghurama: వైద్యపరీక్షల నివేదిక అందింది: సుప్రీం
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్, వైద్యపరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్, వైద్యపరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు అందించిన నివేదిక తమకు అందిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్ చెప్పారు. వైద్య పరీక్షల నివేదికను ఆయన తెరిచారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్‌రే, వీడియో కూడా పంపారని తెలిపారు. రఘురామకృష్ణరాజుకు జనరల్ ఎడిమా ఉందని.. కాలి వేలికి ఫ్రాక్చర్‌తో పాటు మరికొన్ని గాయాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్ వినీత్ శరన్ అన్నారు.
మా ఆరోపణలు నిజమని తేలాయి: ముకుల్ రోహత్గీ
కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న తమ ఆరోపణలు నిజమని తేలాయని రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అన్నారు. ఏపీ సీఐడీ అధికారుల చిత్రహింసలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. సిట్టింగ్ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే స్పందిస్తూ రఘురామే స్వయంగా చేసుకున్న గాయాలా? కాదా? అన్నది తెలియదన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు స్వయంగా గాయాలు చేసుకున్నారని అంటున్నారా? అని ధర్మాసనం న్యాయవాది దవేను ప్రశ్నించింది. వైద్య పరీక్షల నివేదికను ఏపీ ప్రభుత్వం, న్యాయవాదులకు మెయిల్ చేస్తామని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM Jagan: త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
India News
Economic Survey 2023: లోక్‌సభ ముందు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Ileana: ఆసుపత్రిలో చేరిన ఇలియానా.. త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్
-
India News
Droupadi Murmu: ధైర్యవంతమైన ప్రభుత్వం.. విప్లవాత్మక నిర్ణయాలు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
Crime News
Andhra News: అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్: ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు