Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
భాజపా పార్లమెంటరీ బోర్డులో ఇటీవల చోటుచేసుకున్న వ్యవస్థాగత మార్పులపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) విమర్శలు గుప్పించారు.
పార్టీలో నియామకాలపై సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు
దిల్లీ: భాజపా పార్లమెంటరీ బోర్డులో తాజాగా చోటుచేసుకున్న వ్యవస్థాగత మార్పులపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) విమర్శలు గుప్పించారు. ఆఫీస్ బేరర్లను నియమించేందుకు పార్టీ సంస్థాగత ఎన్నికలను దూరం పెట్టిందన్న ఆయన.. ప్రధాని మోదీ (Narendra Modi) ఆమోదంతోనే సభ్యులంతా నామినేట్ అవుతున్నారని ఆరోపించారు. గతంలో ఆఫీస్ బేరర్ల నియామకాలన్నీ పార్టీలో ఎన్నికల ద్వారానే జరిగేవని స్వామి గుర్తుచేశారు.
‘జనతా పార్టీ తొలినాళ్లలో (ఇప్పుడు భాజపా) ఆఫీస్ బేరర్ల పోస్టులను భర్తీ చేసేందుకు పార్టీ, పార్లమెంటరీ పార్టీ ఎన్నికలు జరిగేవి. పార్టీ నిబంధనలు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. కానీ, ప్రస్తుతం భాజపాలో ఎన్నికలనే మాటే లేదు. ఏ పోస్టుకు సభ్యుడిని నామినేట్ చేయాలన్నా అది మోదీ ఆమోదంతోనే జరుగుతోంది’ అని పేర్కొంటూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన భాజపా నేతలు మాత్రం.. పార్టీలో ఏ స్థానాన్ని భర్తీ చేయాలన్నా పార్టీ అధ్యక్షుడే నామినేట్ చేస్తారన్నారు. అనంతరం పార్టీ జాతీయ కార్యవర్గం లేదా ఇతర విభాగాలు వాటిని ఆమోదిస్తాయని.. పార్టీలో ఈ సంప్రదాయం ఎన్నోఏళ్లుగా కొనసాగుతోందని చెబుతున్నారు.
ఇక పార్టీ తరపున ఎంపీగా ఉన్న సమయంలోనూ పలు అంశాలపై సొంతపార్టీపైనే విమర్శలు గుప్పించేవారు సుబ్రహ్మణ్య స్వామి. ప్రస్తుతం విరాట్ హిందుస్థాన్ సంఘం (VHS) అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన.. తాజాగా పశ్చిమ్‌బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు.
ఇదిలాఉంటే, పార్టీలో వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిన భాజపా.. పార్లమెంటరీ బోర్డులో నిన్న మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అందులో నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్లను తప్పించి.. కొత్తగా ఆరుగురు నేతలకు చోటుకల్పించింది. వారిలో తెలంగాణకు చెందిన సీనియర్ నేత కె.లక్ష్మణ్, కర్ణాటక మాజీ సీఎం బి.ఎస్.యడియూరప్ప తదితరులు ఉన్నారు. మరోవైపు- భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)నీ కూడా పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా పునర్వ్యవస్థీకరించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ తదితరులను కొత్తగా కమిటీలోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AP News: కాంగ్రెస్‌లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
Pashupati Paras: కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. బిహార్‌లో చిరాగ్ పాసవాన్‌కు చెందిన ఎల్జేపీ (రాంవిలాస్)తో భాజపా పొత్తు పెట్టుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. -
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు. -
హిందూమతం అంతమే వారి లక్ష్యం
దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్‌సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. -
ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్
జగన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. -
ప్రజాగళం విజయవంతంతోసర్దుకుంటున్న జగన్ సర్కారు
చిలకలూరిపేటలో ఎన్డీఏ సభ (ప్రజాగళం) విజయవంతం కావడంతో జగన్ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమైందని భాజపా అధికార ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
వైకాపాలో చేరిన తెదేపా నేత రామచంద్రరావు
విశాఖపట్నానికి చెందిన తెదేపా నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన భార్య సంధ్యారాణి వైకాపాలో చేరారు. సోమవారం వారు తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు.
తాజా వార్తలు (Latest News)
-
IPL-SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్.. మూడు మ్యాచ్‌లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్‌లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!