Published : 08 May 2022 02:25 IST

Telangana News: రాహుల్‌ గాంధీ పార్ట్‌ టైమ్‌ పొలిటిషియన్‌: తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్‌లో జరిగింది రైతు సంఘర్షణ సభ కాదని... అది కాంగ్రెస్ అంతర్గత సంఘర్షణ సభలా జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. రైతుల కోసం మేము చేసిన పోరాటంలో కాంగ్రెస్ ఎక్కడుందని తలసాని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్‌లతో కలిసి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ పర్యటనపై స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వలేదని.. ఉద్యమ ప్రభావంతోనే రాష్ట్ర సాధన సాధ్యమైందని స్పష్టం చేశారు. వరంగల్‌ డిక్లరేషన్‌ రాష్ట్రానికా లేదా దేశానికా అనే విషయాన్ని కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్‌ గాంధీ పార్ట్‌ టైమ్‌ పొలిటిషియన్‌ అని మంత్రి పేర్కొన్నారు. రాహుల్‌గాంధీకి ఏఐసీసీ ఇస్తామంటే పారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు తెరాస ఒంటరిగానే వెళ్తుందని.. ఎవరితోనూ పొత్తు ఉండదని మంత్రి తలసాని వెల్లడించారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts