Tamilisai: కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం.. గవర్నర్‌ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు

పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 25 May 2023 14:40 IST

చెన్నై: పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని తెలంగాణ నూతన సచివాలయ అంశంతో ముడిపెడుతూ మాట్లాడారు. చెన్నైలో మీడియాతో ఆమె మాట్లాడారు.

‘‘తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారు. సచివాలయ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించలేదు. నాకు కనీసం ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ అంశం ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. రాష్ట్రపతే ప్రారంభించాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదని అంటున్నారు. గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా!’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని