TDP-Janasena: ఈనెలలోనే తెదేపా-జనసేన సమన్వయ కమిటీ సమావేశం!

పొత్తు బంధాన్ని ముందుకు తీసుకెళ్లేలా తెదేపా-జనసేన వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈనెలలోనే ఇరుపార్టీలు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నాయి.

Published : 18 Sep 2023 09:58 IST

అమరావతి: పొత్తు బంధాన్ని ముందుకు తీసుకెళ్లేలా తెదేపా-జనసేన వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈనెలలోనే ఇరుపార్టీలు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నాయి. కమిటీ సభ్యుల నియామకంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించి సీనియర్ నేతలతో చర్చించారు. జనసేన సమన్వయ బాధ్యతలు నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. తెలంగాణ నుంచీ ఓ సభ్యుడిని నియమించే యోచనలో జనసేన ఉంది.  

త్వరలోనే తెదేపా తరఫున సభ్యుల నియామకం జరగనుంది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటన దిల్లీలో కొనసాగుతోంది. ఆయన వచ్చిన తర్వాత రేపు చంద్రబాబుతో జరిగే ములాఖత్‌లో చర్చించిన అనంతరం తెదేపా సమన్వయ కమిటీ సభ్యులను ఆ పార్టీ ప్రకటించనుంది. రెండు పార్టీల సమన్వయ కమిటీ ప్రకటన పూర్తయ్యాక ఈనెలలోనే తొలి సమావేశం జరిగే అవకాశముంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని