పత్తికొండలో వైకాపా, తెదేపా నేతల ఘర్షణ

కర్నూలు జిల్లా పత్తికొండలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతతకు దారితీసింది. ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన తెదేపా నాయకులు, కార్యకర్తలు, మహిళలపై వైకాపా నాయకులు కర్రలతో దాడి చేశారు. మండల

Published : 15 Feb 2021 01:03 IST

కర్రలతో దాడి.. ఐదుగురికి గాయాలు 

పత్తికొండ గ్రామీణం: కర్నూలు జిల్లా పత్తికొండలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతతకు దారితీసింది. ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన తెదేపా నాయకులు, కార్యకర్తలు, మహిళలపై వైకాపా నాయకులు కర్రలతో దాడి చేశారు. మండల పరిధిలోని అటికెలగుండులో ఆదివారం సాయంత్ర ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలకదొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలోని అటికెలగుండులో తెదేపా అభ్యర్థి మంజుల, మరికొంత మంది మద్దతుదారులతో కలిసి అటికెలగుండులో ప్రచారానికి వెళ్లారు. ప్రచారంలో భాగంగా ఓటర్లను కలసి ఓట్లను అభ్యర్థిస్తున్న సమయంలో వైకాపా కార్యకర్తలు ఒక్కసారిగా కర్రలతో దాడికి దిగారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. భయానికి గురైన తెదేపా అభ్యర్థి మంజుల, ఇతర మహిళా కార్యకర్తలు ఏడుస్తూ అక్కడనుంచి పరుగులు తీశారు. వైకాపా నాయకులు వెంటబడి కొట్టారని బాధితులు ఆరోపించారు. సమాచారం అందుకున్న సీఐ ఆదినారాయణరెడ్డి తన సిబ్బందితో వెళ్లి గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తసుకొచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు.

తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి సమాచారాన్ని తెలుసుకున్న తెదేపా పత్తికొండ నియోజకవర్గ బాధ్యులు కేఈ శ్యాంబాబు, బీసీ సెల్‌ రాష్ట్ర నాయకులు రామానాయుడు హుటాహుటిన నలకదొడ్డి గ్రామానికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. తెదేపా నాయకులపై వైకాపా దాడిని వారు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వైకాపా నాయకులు కోటేశ్వరరెడ్డి, ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, తెదేపా మద్దతుదారులు, నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని బాధితులు సీఐకి విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఇవీ చదవండి..

‘ఈ ఎన్నికలు వైకాపా పతనానికి నాంది’

హైదరాబాద్‌ చేరుకున్న అరకు ప్రమాద మృతులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని