Andhra News: ప్రజల ప్రశ్నలకు వైకాపా నేతల వద్ద సమాధానాల్లేవు: అచ్చెన్న

ఏపీలో పూర్వస్థితి రావాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. గ్రామాల్లో వైకాపా నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన చెప్పారు. ఒంగోలులో

Published : 18 May 2022 10:46 IST

ఒంగోలు: ఏపీలో పూర్వస్థితి రావాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. గ్రామాల్లో వైకాపా నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన చెప్పారు. ఒంగోలులో అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏం చేసింది? అని ప్రజలు వైకాపా నేతలను నిలదీస్తున్నారని ఆక్షేపించారు. వారికి నాయకులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. మహానాడు వేదిక ఏర్పాటు చేసుకుంటే తిరస్కరిస్తారా అని నిలదీశారు. మినీ స్టేడియం ఇవ్వకపోతే మండువవారిపాలెంలో స్థలం ఎంపిక చేసినట్లు చెప్పారు.

మహానాడులో 17 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు అచ్చెన్న తెలిపారు. సమాజహితం కోసం పని చేస్తున్న పార్టీ తెలుగుదేశమని వివరించారు. మహానాడును ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో మొదట అనుకున్న చోటే నిర్వహించాలని తెదేపా అధిష్ఠానం ఇటీవల నిర్ణయించింది. ఒంగోలులోని మినీ స్టేడియం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో మండువవారిపాలెం రెవెన్యూ గ్రామ పరిధిలోని త్రోవగుంట వద్ద ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని