ఆలయాలపై దాడుల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

ఏపీలో దేవాలయాలపై దాడుల ఘటనల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని తెదేపా నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు......

Updated : 05 Jan 2021 12:42 IST

తెదేపా నిర్ణయం 

అమరావతి: ఏపీలో దేవాలయాలపై దాడుల ఘటనల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని తెదేపా నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందుకోసం పార్టీ ప్రతినిధుల బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వద్దకు పంపనున్నారు.  అలాగే త్వరలోనే చంద్రబాబు సారథ్యంలోని బృందం గవర్నర్‌ను కలవాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రంలో ఆలయాలపై 125కు పైగా దాడి ఘటనలు, వాటి జాబితాను సిద్ధం చేసినట్టు తెదేపా తెలిపింది. 

సీబీఐ విచారణకు కేంద్రానికి భాజపా లేఖ రాయాలి: అచ్చెన్న 
రాష్ట్రంలో ఆలయాలపై దాడుల గురించి సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి భాజపా లేఖ రాయాలని ఏపీ తెదేపా అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. ఆలయాలపై భాజపాకు ఉన్న ప్రేమ చేతల్లో చూపించాలన్నారు. ఆలయాలపై దాడుల అంశాన్ని భాజపా పక్కదోవ పట్టిస్తోందని విమర్శించారు. క్రైస్తవుడైన డీజీపీ తిరుమల వెళ్తే డిక్లరేషన్‌ ఇవ్వాలన్నారు.

ఇదీ చదవండి..

రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ: వెల్లంపల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని