Chandrababu: నినాదాలకే కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనం: చంద్రబాబు

ఒంగోలులో 17 మంది తెలుగు మహిళలపై అట్రాసిటీ కేసులు పెట్టడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. నినాదాలకే కేసులు పెట్టడం

Updated : 03 May 2022 10:11 IST

అమరావతి: ఒంగోలులో 17 మంది తెలుగు మహిళలపై అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. నినాదాలకే కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనమని ధ్వజమెత్తారు. మహిళా నేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమన్నారు. రేపల్లె అత్యాచార బాధిత మహిళకు భరోసా ఇవ్వాలంటూ మంత్రి కాన్వాయ్‌ వద్ద నినాదాలు చేయడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై హింసను అరికట్టడం ప్రభుత్వం విఫలమైందని ఆక్షేపించారు.

గళమెత్తిన గొంతులను ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. అత్యాచార మహిళ పేరు ఫిర్యాదు కాపీలో రాసి బహిర్గతం చేశారన్నారు. అధికార పార్టీ నేతలు ఇంతకంటే గొప్పగా స్పందిస్తారని ఆశించడం తప్పేనేమో అని ఎద్దేవా చేశారు.ఒంగోలులో మహిళలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. అదుపులోకి తీసుకున్న మహిళలను విడుదల చేయాలని చంద్రబాబు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ఇటీవల రేపల్లె రైల్వేస్టేషన్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధిత మహిళ ఒంగోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరామర్శకు వెళ్లిన హోంమంత్రి వనిత కాన్వాయ్‌ వద్ద తెలుగు మహిళలు నినాదాలు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసులు పెట్టిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని