Chandrababu: సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?: చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త కోన వెంకట్రావుది మూమ్మాటికీ హత్యేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు

Updated : 08 Mar 2022 12:54 IST

అమరావతి: శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త కోన వెంకట్రావుది మూమ్మాటికీ హత్యేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తే వేధించి ప్రాణాలు తీస్తారా?అని మండిపడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, పోలీసులపై కేసు నమోదు చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. వెంకట్రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

‘‘తెదేపా కార్యకర్త కోన వెంకట్రావును వైకాపా నాయకులు వేధించారు. బలవన్మరణానికి పాల్పడేలా చేసిన వైకాపా దుర్మార్గాన్ని ఖండిస్తున్నా. సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టడమే నేరంగా వెంకట్రావును వేధించారు. కార్యకర్త మృతికి కారకులైన ఎమ్మెల్సీ దువ్వాడ, పోలీసులనూ అరెస్టు చేయాలి. బాధిత కుటుంబానికి తెదేపా అండగా ఉంటుంది. పోలీసులను అడ్డుపెట్టుకొని వేధిస్తే తిరుగుబాటు తప్పదు’’ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని