Chandrababu: 2024లో ఓడిపోతే వైకాపా ఉండదని జగన్‌కు అర్థమైంది: చంద్రబాబు

జగన్‌ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 09 May 2022 15:09 IST

అమరావతి: జగన్‌ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 2024లో ఓడిపోతే వైకాపా అనేది ఉండదని జగన్‌కు అర్థమైందన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలు, మండల, డివిజన్‌ అధ్యక్షులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘‘జగన్‌ సింహం కాదు పిల్లి.. భయంతో అందరి కాళ్లు పట్టుకుంటున్నారు. భీమిలి పర్యటనలో ప్రజలు ‘జై బాబు’ అని నినాదాలు చేశారు. ‘జై జగన్‌’ అన్నట్లు మార్ఫింగ్‌ చేసి దుష్ర్పచారం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలి అన్నాను. నా వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారు’’ అని చంద్రబాబు అన్నారు. మరోవైపు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని ఉద్ధృతంగా తీసుకెళ్లాలని నాయకులకు ఆయన సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించండని కార్యకర్తలను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని