Chandrababu: మీరు ఆపితే మహానాడు ఆగుతుందా?: చంద్రబాబు

ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి నుంచి ఒంగోలు మహానాడుకు ర్యాలీగా బయల్దేరిన ఆయన మార్గం మధ్యలో

Updated : 26 May 2022 15:46 IST

చిలకలూరిపేట: ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి నుంచి ఒంగోలు మహానాడుకు ర్యాలీగా బయల్దేరిన ఆయన మార్గం మధ్యలో చిలకలూరిపేట వద్ద ఆగారు. అక్కడ తెదేపా శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

భవిష్యత్తులో చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం..

‘‘తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. 1994లో కూడా ఇంత ఉత్సాహం లేదు. తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. పార్టీ నాయకులను వేధించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. వీటన్నింటికీ భవిష్యత్తులో చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం. ఎంతో మంది సీఎంలను చూశాను. ఇలాంటి పనికిమాలిన చిల్లర ముఖ్యమంత్రిని చూడలేదు.

నిన్న ఓ మంత్రి మహానాడును తాము అడ్డుకోవడం లేదని చెప్పారు. మీరు ఆపితే మహానాడు ఆగుతుందా? ఒంగోలులో సభకు గ్రౌండ్‌ ఇవ్వరా? వైకాపాకు ఊడిగం చేసే అధికారుల భరతం పడతాం. తెదేపా ఫ్లెక్సీలు చించేస్తారా? నాకు కోపం వస్తే ఎవరినీ వదిలిపెట్టను. మర్యాదగా మీరుంటే నేనూ మర్యాదగా ఉంటా. పిచ్చివేషాలు వేస్తే తోక కత్తిరించి పంపుతాం. మహానాడు ఓ ప్రభంజనం. ఎక్కడికక్కడ కట్టలు తెంచుకొని మహానాడుకు రండి. మీకు నేను అండగా ఉంటాను. ఈ మహానాడు ద్వారా క్విట్‌ జగన్‌.. సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు పిలుపిద్దాం. మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. రాష్ట్రంలో ఏ వర్గమూ బాగాలేదు’’ అని చంద్రబాబు అన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని