Chandrababu: సైకో పాలన వద్దు.. సైకిల్‌ పాలన కావాలి: చంద్రబాబు

రాష్ట్రానికి సైకో పాలన వద్దు.. సైకిల్‌ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అప్పుడే ప్రజల జీవితాలు బాగుంటాయని చెప్పారు.

Updated : 01 Dec 2022 23:37 IST

అమరావతి: రాష్ట్రానికి సైకో పాలన వద్దు.. సైకిల్‌ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అప్పుడే ప్రజల జీవితాలు బాగుంటాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా  ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ‘‘రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అంతా ఐక్యం కావాలి. జగన్మోహన్ రెడ్డి ఐరన్ లెగ్ పోలవరం మీద పడటంతో అది మాటాష్ అయింది. ప్రాణ సమానంగా కాపాడుకున్న డయాఫ్రమ్ వాల్, పోలవరం ప్రాజెక్టులు గోదావరి పాలయ్యాయి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చిన్న పిల్లని పెంచినట్లు పెంచుకొచ్చిన పొలవరాన్ని నీళ్లపాలు చేశారు. 70ఏళ్ల తెలుగువారి కల సాకారం కాకుండా బహుళార్థ సాధక ప్రాజెక్టును బ్యారేజీగా మారుస్తున్నారు. పోలవరం నీటితో నేనొక్కడినే వ్యవసాయం చేసుకుంటానా? దీని వల్ల ఎవరికి లాభం?జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదీ మిగల్చలేదు. 5 ఏళ్లలో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు, 5లక్షల ఉద్యోగాలు తీసుకొస్తే వాటిని తరిమేస్తున్నాడు. తరిమేసినంత తేలిగ్గా పెట్టుబడులు తీసుకురావటం కష్టం. అప్పులు చేసే ముఖ్యమంత్రి సమర్థుడా లేక సంపద సృష్టించేవాడా?కులం పేరుతో అమరావతి రైతుల్ని చంపేసి రూ.2లక్షల కోట్ల ఆస్తిని నాశనం చేస్తున్నాడు. తన స్వలాభం కోసం బటన్ నొక్కుకుంటూ 175 సీట్లను గెలిపించమంటున్నాడు. నాకంటే కార్యకర్తలే ఆవేశంగా ఉన్నారు. ఏలూరు నుంచి పోలవరం మీదుగా కొవ్వూరు వచ్చేసరికి నా నడుం దెబ్బతింది. రహదారుల దుస్థితి తీవ్రతకు ఉయ్యాల ప్రయాణం అద్దం పడుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల పాలిట భస్మాసుర మామ. జగన్‌లా నాకు వాలంటీర్లు, బ్లూ మీడియా లేకున్నా కార్యకర్తలే కొండంత బలం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాకపోగా బాదుడే బాదుడు’’ అని అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని