CBN: సుప్రీం ఆదేశాల‌కు విరుద్ధంగా అరెస్టులు

అరెస్టుల‌తో ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌శ్నించే వారి గొంతు నొక్కుతోంద‌ని తెదేపా అధినేత చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. నోటీసులు ఇవ్వ‌కుండానే గుంటూరు అరండ‌ల్‌పేట్ పోలీసులు తెదేపా

Published : 19 May 2021 16:19 IST

డీజీపీ స‌వాంగ్‌కు తెదేపా అధినేత చంద్ర‌బాబు లేఖ‌

అమ‌రావ‌తి: అరెస్టుల‌తో ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌శ్నించే వారి గొంతు నొక్కుతోంద‌ని తెదేపా అధినేత చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. నోటీసులు ఇవ్వ‌కుండానే గుంటూరు అరండ‌ల్‌పేట్ పోలీసులు తెదేపా కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశార‌న్నారు. ఈ మేర‌కు చంద్ర‌బాబు డీజీపీ గౌతమ్‌స‌వాంగ్‌కు లేఖ రాశారు. అరెస్టు చేసిన కార్య‌కర్త‌ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఏపీలో సుప్రీంకోర్టు ఆదేశాల‌కు విరుద్ధంగా అరెస్టులు జ‌రుగుతున్నాయ‌ని లేఖ‌లో పేర్కొన్నారు. అధికార పార్టీని ప్ర‌శ్నించే వారిపై అక్ర‌మంగా కేసులు పెడుతున్నార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు.



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని