Andhra News: జగన్‌ పాలనలో తీవ్ర సంక్షోభంలోకి వ్యవసాయ రంగం: అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

Published : 11 May 2022 14:58 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని.. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నదాతలకు అండగా నిలబడేందుకు తెదేపా ఆధ్వర్యంలో ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో కమిటీ ఏర్పాటు చేసినట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటించి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుందని వెల్లడించారు. తెదేపా నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, ప్రత్తిపాటి పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్ర, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి, కూన రవికుమార్, తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని సభ్యులుగా నియమించినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని