MLC Election: రసవత్తరంగా ఎమ్మెల్యే కోటా ఎన్నికలు.. పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన తెదేపా
మొత్తం 23 మంది పార్టీ ఎమ్మెల్యేలకు తెదేపా ఎమ్మెల్యే, విప్ డోల బాలవీరాంజనేయస్వామి విప్ జారీ చేశారు. విప్‌ను ఆయా ఎమ్మెల్యేలకు స్పీడ్ పోస్టులో పంపించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా అందజేశారు.
అమరావతి: ఏపీలో ఈనెల 23న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) రసవత్తరంగా మారాయి. ప్రతి ఎమ్మెల్యే ఓటు కీలకంగా మారడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలకు తెదేపా(TDP) విప్ జారీ చేసింది. మొత్తం 23 మంది పార్టీ ఎమ్మెల్యేలకు తెదేపా ఎమ్మెల్యే, విప్ డోల బాలవీరాంజనేయస్వామి విప్ జారీ చేశారు. విప్‌ను ఆయా ఎమ్మెల్యేలకు స్పీడ్ పోస్టులో పంపించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా అందజేశారు. 23న జరిగే ఎన్నికల్లో పాల్గొని తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాల్సిందిగా స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో స్థానంలో అభ్యర్థి గెలవాలంటే 22 నుంచి 23 ఓట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం తెదేపా తరఫున 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వారిలో నలుగురు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి వైకాపాకు మద్దతు ప్రకటించారు. మరో వైపు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఇద్దరూ వైకాపా రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారు ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని చెబుతున్నారు. ఈనేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలకు తెదేపా విప్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
MLC Elections: వైకాపా పతనం ప్రారంభమైంది: తెదేపా శ్రేణులు
-
Politics News
KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు
-
India News
CBIకి కొత్త చట్టం అవసరం.. పార్లమెంటరీ కమిటీ సూచన
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీకి జైలు శిక్ష.. ఎంపీగా అనర్హుడవుతారా..?