TDP: స్పీకర్‌ ఎన్నిక.. పార్టీ ఎంపీలకు విప్‌ జారీ చేసిన తెదేపా

లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీలకు ఆ పార్టీ విప్‌ జారీ చేసింది.

Published : 25 Jun 2024 22:17 IST

దిల్లీ: లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీలకు ఆ పార్టీ విప్‌ జారీ చేసింది. బుధవారం లోక్‌సభకు ఎంపీలు తప్పనిసరిగా హాజరు కావాలని లోక్‌సభలో తెదేపా చీఫ్ విప్‌ హరీష్ బాలయోగి పేర్కొన్నారు. ఉదయం 11గంటలకు తప్పక లోక్‌సభలో ఉండాలని, ఎన్డీయే స్పీకర్‌ అభ్యర్థికి ఓటు వేయాలని స్పష్టం చేశారు. రేపు ఉదయం 9.30గంటలకు లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో తెదేపా ఎంపీల సమావేశం జరగనుంది. స్పీకర్‌ ఎన్నికలో ఓటింగ్‌ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించనున్నారు. సమావేశం అనంతరం అందరూ కలిసి పార్లమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించారు. ఏపీ భాజపా, జనసేన ఎంపీలను కూడా లావు నివాసంలో జరిగే సమావేశానికి తెదేపా ఆహ్వానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని