TDP: లోక్‌సభలో 6వ అతిపెద్ద పార్టీ తెదేపా.. వైకాపాకు ఎన్నో స్థానమంటే?

మొత్తం 41 పార్టీల సభ్యులతో కొత్తగా ఏర్పడనున్న 18వ లోక్‌సభలో సంఖ్యాపరంగా తెలుగుదేశం ఆరో అతిపెద్ద పార్టీగా నిలుస్తోంది.

Updated : 19 Jun 2024 16:18 IST

ఈనాడు, దిల్లీ: మొత్తం 41 పార్టీల సభ్యులతో కొత్తగా ఏర్పడనున్న 18వ లోక్‌సభలో సంఖ్యాపరంగా తెలుగుదేశం ఆరో అతిపెద్ద పార్టీగా నిలుస్తోంది. మొత్తం సభలో భాజపా - 240, కాంగ్రెస్‌ - 99, సమాజ్‌వాదీ పార్టీ - 37, తృణమూల్‌ కాంగ్రెస్‌- 29, డీఎంకే - 22 స్థానాలతో తెదేపా కంటే పైనున్నాయి. తెలుగుదేశం పార్టీ 16 మంది సభ్యులతో  6వ స్థానంలో ఉంది. ఈ ఎన్నికల్లో భాజపాకు మాత్రమే మూడంకెల స్థానాలు దక్కాయి. 34 పార్టీలకు ఏక అంకె సీట్లే దక్కాయి. అందులో 16 పార్టీలకు కేవలం ఒక్కో సీటు మాత్రమే వచ్చింది. 4 స్థానాలతో వైకాపా 15వ స్థానంలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని