బాక్సైట్‌ దోపిడీకే రోడ్డు నిర్మించారు: లోకేశ్‌

ఏపీ సీఎం జగన్‌ అవినీతి స్థాయికి రూ.15వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం అద్దం పడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘విశాఖ మన్యంలో వైకాపా మాఫియా బాక్సైట్‌ గనుల

Published : 06 Jul 2021 15:15 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ అవినీతి స్థాయికి రూ.15వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం అద్దం పడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘విశాఖ మన్యంలో వైకాపా మాఫియా బాక్సైట్‌ గనుల దోపిడీకి ప్రభుత్వమే రహదారి నిర్మించింది. రికార్డు స్థాయిలో 24 రోజుల వ్యవధిలోనే అటవీ ప్రాంతంలో 14కి.మీ మేర 30 అడుగుల రహదారిని నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. భారీ వాహనాల రవాణా సులభతరం చేస్తూ 10 వేల చెట్లు నరికేశారు. 250 మంది జనాభా ఉన్న మారుమూల ప్రాంతానికి రహదారి ఏర్పాటు కోసం ఇదంతా చేశామని జగన్ సర్కార్‌ చెప్పటం అవినీతికి పరాకాష్ఠ’’ అని లోకేశ్‌ దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని