మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసు.. అంతా సజ్జల డైరెక్షన్‌లోనే: మాజీ మంత్రి బండారు

మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును ఎందుకు అరెస్ట్‌ చేయలేదని

Updated : 23 May 2022 14:56 IST

విశాఖపట్నం: మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును ఎందుకు అరెస్ట్‌ చేయలేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ నుంచి మృతదేహం తెచ్చినా ఆయన్ను ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండారు మాట్లాడారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లోనే ఈ నాటకమంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు. దళిత సంఘాల ఉద్యమాన్ని నీరుగార్చే చర్యలు జరుగుతున్నాయన్నారు. హత్య చేసిన వ్యక్తి.. మృతుడి భార్యకు మృతదేహం అప్పగించడం జగన్‌ పాలనలోనే జరుగుతోందని ఆయన మండిపడ్డారు. జగన్‌ దావోస్‌లో ఉండి సజ్జలతో ఈ వ్యవహారం నడిపిస్తున్నారని తీవ్రస్థాయిలో బండారు సత్యనారాయణ ఆరోపించారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని.. అతడి భార్య చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా ఉంటామని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని