
AP News: షర్మిల ఏపీలో పార్టీ పెడితే మొదట చేరేది ఆయనే: బుద్దా వెంకన్న
విజయవాడ: రాష్ట్రంలోని సమస్యలను దృష్టి మరల్చేందుకే మంత్రి కొడాలి నాని తెదేపా అధినేత చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఇకపై చంద్రబాబు గురించి మాట్లాడితే అదే రీతిలో బుద్ధి చెబుతామని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడం లేదని గుడివాడలో కొడాలి నాని క్యాసినో పరిశ్రమను తీసుకొచ్చారని విమర్శించారు. విజయవాడలో ఆ పార్టీ నేత నాగుల్ మీరాతో కలిసి బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు.
‘‘చంద్రబాబు గురించి మాట్లాడితే మేం పదిరెట్లు స్పందిస్తాం. షర్మిల ఏపీలో పార్టీ పెడితే.. చేరే మొదటి వ్యక్తి కొడాలి నాని. సుపరిపాలన చేతగాకే చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. జోగి రమేశ్‌లా చంద్రబాబు ఇంటి వైపు ఎవరైనా వస్తే చావగొట్టి పంపుతాం. డీజీపీ తీరు డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా ఉంది. గుడివాడలో కొడాలి నాని ఆయిల్ దొంగతనాలు చేశారు. కొడాలిపై అప్పటి పోలీసు అధికారి వర్ల రామయ్య చర్యలు తీసుకోలేదా?’’ అని బుద్దా వెంకన్న అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.