AP news: ధాన్యం కొనుగోళ్ల లెక్క‌లు అస‌త్యం: దేవినేని

ఏపీలో ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి మంత్రి కొడాలి నాని అస‌త్య‌పు లెక్క‌లు చెబుతున్నార‌ని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. సీఎం జ‌గ‌న్ క‌ళ్ల‌లో ఆనందం కోస‌మే తెదేపా అధినేత చంద్ర‌బాబు, ఆ పార్టీ

Updated : 19 Jun 2021 15:03 IST

అమ‌రావ‌తి: ఏపీలో ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి మంత్రి కొడాలి నాని అస‌త్య‌పు లెక్క‌లు చెబుతున్నార‌ని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. సీఎం జ‌గ‌న్ క‌ళ్ల‌లో ఆనందం కోస‌మే తెదేపా అధినేత చంద్ర‌బాబు, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి రూ.5,308 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. కేవ‌లం రూ.1,637 కోట్లు ఇచ్చి అంతా ఇచ్చిన‌ట్లు చెబుతున్నార‌ని ఆక్షేపించారు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల‌పై శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ద‌ళారులు, వ్యాపారులు కుమ్మక్కై వ్యాపారుల‌ను దోచేసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని