Andhra News: మైలవరంలో తెదేపా నేత దేవినేని ఉమ అరెస్టు

కృష్ణా జిల్లా మైలవరంలో తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌ చేయాలని కోరుతూ

Updated : 30 Mar 2022 23:12 IST

మైలవరం: కృష్ణా జిల్లా మైలవరంలో తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌ చేయాలని కోరుతూ మైలవరంలో దేవినేని నిరసన చేపట్టారు. మైలవరం రెవెన్యూ డివిజన్‌ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో దేవినేని పాల్గొన్నారు. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుడివాడను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ ఆమోదం తెలిపింది. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దేవినేని ఉమ ఆధ్వర్యంలో నేతలు మైలవరం నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనను ఉపసంహరించుకోవాలని పలుమార్లు పోలీసులు కోరినప్పటికీ దేవినేని వినకుండా నిరసన కొనసాగించారు. దాదాపు 3 గంటలపాటు నిరసన తెలుపడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడమే కాకుండా తెదేపా శ్రేణులు పెద్దఎత్తున ధర్నా ప్రదేశానికి చేరుకుంటుండటంతో  కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో దీక్ష విరమించేది లేదని దేవినేని తేల్చి చెప్పడంతో ఆయనను మైలవరం పోలీసుస్టేషన్‌కు తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు