తప్పుడు కేసులకు భయపడం: దేవినేని ఉమ

కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌ నుంచి తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విడుదలయ్యారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన ఉమాను పోలీసులు అరెస్ట్‌ చేసి పమిడిముక్కల స్టేషన్‌కు తరలించారు.

Published : 20 Jan 2021 01:57 IST

పమిడిముక్కల: కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌ నుంచి తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విడుదలయ్యారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన ఉమాను పోలీసులు అరెస్ట్‌ చేసి పమిడిముక్కల స్టేషన్‌కు తరలించారు. విడుదలైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కొడాలి నానిపై విమర్శలు చేశారు. 

కొడాలి నానికి చదువుతోపాటు సంస్కారం కూడా లేదని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. బాధ్యతారాహిత్యంగా, సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పెద్ద వయసు అని కూడా చూడకుండా తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ నేతలను ఆడిపోసుకుంటున్నారని మండిపడ్డారు. గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తాను నిరసన దీక్ష చేపడతానంటే వందలాది మంది పోలీసులు తమను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

‘‘మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు? సీబీఐ విచారణ కోరి ఎందుకు పారిపోయారు?’’ తదితర ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. ‘‘ప్రశ్నిస్తే చంపేస్తారా?మంత్రుల బూతులకు, తప్పుడు కేసులకు తెదేపా కార్యకర్తలు భయపడరు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. జిల్లా నాయకులందరం కలిసి వైకాపా దుర్మార్గాలను అరికడతాం’’ అని దేవినేని ఉమ చెప్పారు.

ఇవీ చదవండి..

ఉమాపై కొడాలి నాని మరోసారి తీవ్ర విమర్శలు

ప్రశ్నిస్తే చంపేసే నయా నియంత జగన్‌: లోకేశ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని