Dhuliaplla Narendra: తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మట్టిమాఫియాకు వ్యతిరేకంగా తెదేపా నేతలు తలపెట్టిన ‘చలో అనుమర్లపూడి’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆంక్షలు

Updated : 20 Jun 2022 13:11 IST

పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మట్టిమాఫియాకు వ్యతిరేకంగా తెదేపా నేతలు తలపెట్టిన ‘చలో అనుమర్లపూడి’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆంక్షలు దాటుకుని అనుమర్లపూడి చెరువు వద్దకు చేరుకున్న తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేశారు. పోలీసుల వైఖరిపై నరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ సహా ఎవరి అనుమతులతో చెరువును తవ్వుతున్నారని.. వైకాపా అరాచకాలకు అంతులేకుండా పోతోందని మండిపడ్డారు. ఈ క్రమంలో తెదేపా కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి తెదేపా నేతలు అనుమర్లపూడి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని