AP news: సంక్షోభంలోకి విద్యుత్‌ రంగం: కళా

వైకాపా రెండేళ్ల పాలనలో విద్యుత్‌ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని తెదేపా సీనియర్‌ నేత

Updated : 10 Jul 2021 11:13 IST

అమరావతి: వైకాపా రెండేళ్ల పాలనలో విద్యుత్‌ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని తెదేపా సీనియర్‌ నేత కళా వెంకట్రావు అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి అన్నదాతలను అప్పులపాల్జేశారని ఆరోపించారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణల ఘనత చంద్రబాబుదైతే.. కమీషన్లు దండుకున్న ఘనత సీఎం జగన్‌ది అని ఆయన విమర్శించారు. మాట ఇచ్చి మోసం చేయడం జగన్‌కు దినచర్యగా మారిందని, రెండేళ్లలోనే మూడుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని కళా ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని