పీలేరులో రూ.400 కోట్ల భూకుంభకోణం: కిశోర్‌

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో భారీ భూ కుంభకోణం జరిగిందని తెదేపా నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 03 Jul 2021 11:50 IST

పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో భారీ భూ కుంభకోణం జరిగిందని తెదేపా నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో హైవేకు ఆనుకుని రూ.400 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నారు. మంత్రి, ఎంపీల అండ చూసుకొని వైకాపా నేతలు భూ కబ్జాకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రభుత్వ భూములకు లే- అవుట్లు వేసి అక్రమంగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ఆక్రమణలకు సంబంధించిన ఊరు, సర్వే నెంబర్ల వివరాలను ఆయన మీడియా ముందు ఉంచారు. జిల్లాలో భూ అక్రమాలపై సర్వే నెంబర్లు త్వరలో బయటపెడతామని కిశోర్‌ అన్నారు.

భూ కుంభకోణంపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. కొనుగోలు చేసిన భూములు చెల్లవని కోర్టులో తేలితే ప్రజలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. భూ కుంభకోణం మదనపల్లె, ఇతర ప్రాంతాలకు విస్తరించిందని చెప్పారు. దీనిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని కిశోర్‌ ఆరోపించారు. అక్రమాలకు సహకరించిన అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని