Pattabhi: ఉండవల్లి తన వ్యక్తిత్వాన్ని తానే చంపుకొన్నారు: పట్టాభి

కోర్టులకు హాజరుకాకుండా పారిపోయిన వ్యక్తి జగన్‌ అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు.

Updated : 22 Sep 2023 14:28 IST

రాజమహేంద్రవరం: కోర్టులకు హాజరుకాకుండా పారిపోయిన వ్యక్తి జగన్‌ అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. రాజమహేంద్రవరం జైలు వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దిల్లీలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు.

‘‘చంద్రబాబు అరెస్ట్‌తో జగన్‌ తన జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశారు. ఆయన బయటకు వచ్చాక యుద్ధమే. జగన్‌కు ఇక జ్వరం తగ్గదు.. పెరుగుతూనే ఉంటుంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తన వ్యక్తిత్వాన్ని తానే చంపుకొన్నారు. ఉండవల్లీ.. హైకోర్టులో పిటిషన్ మీరు వేసిందేనా? రాష్ట్రంలో మద్యం, మైన్స్‌, మట్టి అక్రమాలు మీకు కనిపించడం లేదా? ఎవరో తయారు చేసిన పిటిషన్‌పై మీరు సంతకం పెట్టలేదా? సాక్షి పేపర్లో వచ్చిన వార్తలపై స్పందించి పిటిషన్‌ వేశారా?’’అని పట్టాభి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని