Updated : 13 Aug 2022 17:55 IST

Andhra News: మాధవ్‌ నగ్న వీడియో నకిలీది కాదు.. ఇదిగో ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌: పట్టాభి

అమరావతి: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో నకిలీది కాదని.. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్ధారించినట్లు తెలుగుదేశం నేతలు వెల్లడించారు. ఈమేరకు పార్టీ తరఫున వీడియోను ప్రైవేటుగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. ఆ వీడియోలో మార్ఫింగ్‌ జరగలేదని ల్యాబ్‌ నిపుణుడు జిమ్‌ స్టాఫ్‌ వార్డ్‌ నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు. ల్యాబ్‌ ఇచ్చిన నివేదికను పార్టీ నేతలు కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, వంగలపూడి అనిత బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా తెదేపా అధికార ప్రతినిధి  పట్టాభిరామ్‌ మాట్లాడుతూ.. ‘‘గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియోను ఆగస్టు 9న ఫోరెన్సిక్‌కు పంపించాం. ఆగస్టు 10న ఆయనను మీడియా ముందుకు ప్రవేశపెట్టి వీడియోలో ఏమీ లేదని కవరప్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ విషయంలో సీఎం జగన్‌ ఏ రకంగా చర్యలు తీసుకున్నారో అందరం చూశాం. గోరంట్ల మాధవ్‌ విషయంలోనూ నిస్సిగ్గుగా వెనకేసుకొస్తారని ఊహించే అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్‌కు ఆ వీడియోను పంపించాం’’ అని తెలిపారు.

వీడియోలో మార్ఫింగ్‌ జరగలేదనటానికి సీఎం జగన్‌కి ఈ ఆధారాలు చాలా? ఇంకేమైనా కావాలా?అని తెదేపా నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర మహిళలకు ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎంపీ పదవిలో కొనసాగే అర్హత మాధవ్‌ కోల్పోయారని విమర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో ఫోరెన్సిక్‌కి పంపినా ఉపయోగం లేదని ప్రభుత్వం చెప్పటం పచ్చి అబద్ధమన్నారు. ఎంపీపై చర్యలు తీసుకోకపోగా ఎంపీని వెనకేసుకొస్తే ఇక రాష్ట్రంలో మహిళలు ఎలా ధైర్యంగా తిరగగలరని ప్రశ్నించారు. ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసే అర్హత మాధవ్‌కు లేదన్నారు. తాము బయటపెట్టిన ఫోరెన్సిక్‌ నివేదికపై చర్చించే ధైర్యం ప్రభుత్వంలో ఎవరికైనా ఉందా? అని సవాల్‌ విసిరారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని