ప్రాణాలొడ్డి సేవలందిస్తే..లాఠీఛార్జి చేస్తారా? 

ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కరోనా వారియర్స్‌ విషయంలో వైకాపా ప్రభుత్వ తీరు అభ్యంతరకరంగా ఉందని తెదేపా జాతీయ

Updated : 27 Mar 2021 13:30 IST

అమరావతి: ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కరోనా వారియర్స్‌ విషయంలో వైకాపా ప్రభుత్వ తీరు అభ్యంతరకరంగా ఉందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆక్షేపించారు. వారియర్స్‌కు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోగా .. విధుల్లోంచి తొలగించడం దారుణమన్నారు. ఇదేనా వారికి జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చే  గౌవరమని మండిపడ్డారు. కరోనా రెండో దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వీడట్లేదని విమర్శించారు.  గుంటూరులో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌పై లాఠీఛార్జి చేయడం దుర్మార్గమన్న పట్టాభి... తక్షణమే వారియర్స్‌కు పెండింగ్‌ వేతనాలు చెల్లించి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కరోనా వారియర్స్‌ను విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని