AndhraPradesh News: ఆర్థిక పరిస్థితిపై ఇంకెన్నాళ్లు పిట్టకథలు: పయ్యావుల

చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతప్రతం విడుదల చేయాలని తెదేపా సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. 

Published : 29 Jan 2022 14:11 IST

అమరావతి: చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతప్రతం విడుదల చేయాలని తెదేపా సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన ఇంకెంతకాలం పిట్టకథలతో నెట్టుకొస్తారని ఆయన మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితిపై మంత్రి పొంతన లేని ప్రకటనలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. మూలధన వ్యయం ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంతో స్పష్టం చేయాలని పయ్యావుల డిమాండ్‌ చేశారు. పథకాలకు ఖర్చు చేసే మొత్తం కంటే ప్రకటనలకు వెచ్చించిందే ఎక్కువని ఆరోపించారు. కొత్త పెట్టుబడులు రాక రాష్ట్రాన్ని 20ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదాయం బాగున్నప్పుడు పొరుగు రాష్ట్రాల మాదిరి ఎందుకు జీతాల్లేవేంటని నిలదీశారు. మరో తరం పాటు రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశారని మండిపడ్డారు. శాఖల వారీగా ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి కంటే రెండు రెట్లు ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఏ బ్యాంకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదని పయ్యావుల ఎద్దేవా చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు