‘మమతను చూసైనా జగన్‌ కళ్లు తెరవాలి’

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో తెలుగును అధికార భాషగా గుర్తించడంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హర్షం

Updated : 24 Dec 2020 04:55 IST

తెదేపా సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో తెలుగును అధికార భాషగా గుర్తించడంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు తెలుగుపై ఉన్న గౌరవం మన రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. మమతా బెనర్జీని చూసైనా ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి కళ్లు తెరవాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడటం ప్రజల హక్కు అని, తల్లి భాషలో నేర్చుకున్న విద్యకే పరిపూర్ణత లభిస్తుందని సోమిరెడ్డి అన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఆంగ్లం, హిందీ వంటి భాషలు అవసరమేనని, అయితే వాటికోసం మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. 

తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ పశ్చిమ బెంగాల్‌  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసనసభ ఎన్నికల వేళ తెలుగు ప్రజల చిరకాల వాంఛను మమతా బెనర్జీ ప్రభుత్వం గౌరవించింది. ఈమేరకు బంగాల్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బంగాల్‌లో ఇప్పటికే పదికి పైగా అధికార భాషలున్నాయి.

ఇవీ చదవండి..
మడమతిప్పని ఉద్యమ పోరు

2020లో ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనలు..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని