Yanamala: జగన్‌ మాటలు తేనె పూసిన కత్తులు.. ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు?: యనమల

సొమ్మొకది.. సోకొకడిది అన్న చందంగా సీఎం జగన్‌ వైఖరి ఉందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు.

Updated : 14 May 2022 16:54 IST

అమరావతి: సొమ్మొకరిది.. సోకొకడిది అన్న చందంగా సీఎం జగన్‌ వైఖరి ఉందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. మత్స్యకారులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని 6 నెలలుగా తొక్కిపట్టి.. ఇవ్వాల్సిన దానిలో సగం పెండింగ్‌ పెట్టింది జగన్‌ కాదా? అని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

దుష్టబుద్ధి, వక్రబుద్ధి జగన్‌దేనని యనమల విమర్శించారు. కోనసీమ జిల్లా మురమళ్లలో సీఎం చెప్పిన మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఓఎన్‌జీసీ పైపులైన్లతో నష్టపోయిన మత్స్యకారులకు ఇచ్చే పరిహారం కేంద్రానిదని.. అదేదో తానే సొంతంగా జేబులోంచి ఇస్తున్నట్లుగా జగన్‌ ఫోజులు కొట్టడం హాస్యాస్పదమన్నారు.

మీ దోపిడీ సొమ్ము జమచేస్తే ఇంత ఆర్థిక సంక్షోభం ఉండేదా?

సీఎం మాటలు తేనెపూసిన కత్తులని. మాయ మాటలతో ఎన్నాళ్లు మోసం చేస్తారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ మూడేళ్ల నిర్వాకాలను ప్రజలే నిలదీస్తున్నారని.. ఇంకెన్నాళ్లు ప్రతిపక్షాలను ఆడిపోసుకుంటారని ఆయన మండిపడ్డారు. జగన్‌ దోపిడీ సొమ్ము ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తే ఇంత ఆర్థిక సంక్షోభం ఉండేదా? అని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని