కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: రామ్మోహన్‌

కొవిడ్ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో వైర‌స్ క‌ట్ట‌డి గురించి ఆలోచించాల్సిన సీఎం జ‌గ‌న్.. ప్ర‌తి ప‌క్ష నాయ‌కుల అరెస్టుల‌పై దృష్టి సారించ‌డం శోచ‌నీయ‌మ‌ని తెదేపా ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు మండిప‌డ్డారు.

Published : 28 May 2021 01:41 IST

అమ‌రావ‌తి: కొవిడ్ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో వైర‌స్ క‌ట్ట‌డి గురించి ఆలోచించాల్సిన సీఎం జ‌గ‌న్.. ప్ర‌తి ప‌క్ష నాయ‌కుల అరెస్టుల‌పై దృష్టి సారించ‌డం శోచ‌నీయ‌మ‌ని తెదేపా ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు మండిప‌డ్డారు. క‌రోనా క‌ట్ట‌డిలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌లమైంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొవిడ్ క‌ట్ట‌డిలో తీవ్ర వైఫ‌ల్యాలు, త‌ల‌కిందులైన కుటుంబ ఆదాయం అనే అంశంపై రామ్మోహ‌న్‌నాయుడు మహానాడులో మాట్లాడారు. అంద‌రికీ వ్యాక్సిన్ అందించ‌డంతో పాటు బ్లాక్ ఫంగ‌స్ నివార‌ణ‌కు స‌దుపాయాల‌ను పెంచాల‌ని డిమాండ్ చేస్తూ రూపొందించిన తీర్మానాన్ని ఏక‌గ్రీవంగా ఆమోదించారు.

సీఎం జగన్‌ది మొద్దునిద్ర: నిమ్మల

ప్ర‌పంచం మొత్తం క‌రోనా వ్యాక్సిన్ కోసం పోటీ ప‌డుతుంటే.. సీఎం మొద్దు నిద్ర పోతున్నార‌ని తెదేపా ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు విమ‌ర్శించారు. క‌రోనా రెండో ద‌శ 20 రెట్లు ప్ర‌మాద‌క‌ర‌మైనా క‌నీసం టీకాల కోసం ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించ‌డం లేద‌న్నారు. కొవిడ్ ప్ర‌మాద‌కరంగా మారుతున్నా.. స్పంద‌న లేద‌ని మండిప‌డ్డారు. వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సంస్థ‌ల‌కు సీఎం లేఖ‌లు రాస్తున్నార‌ని.. లేఖ‌లు రాస్తే వ్యాక్సిన్‌లు రావ‌ని రామానాయుడు ఎద్దేవా చేశారు. ప్ర‌భుత్వం డబ్బులు చెల్లించి వ్యాక్సిన్లు తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌జాధ‌నాన్ని ప్ర‌భుత్వం లూటీ చేసి సోకులు చేసుకుంటోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts