AP News: కొవిడ్ క‌ట్ట‌డి వ‌దిలేసి..కక్ష సాధింపులా?

ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో బిజీగా ఉన్నార‌ని తెదేపా జాతీయ ప్ర‌ధాన

Updated : 25 May 2021 05:59 IST

అమ‌రావ‌తి: ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో బిజీగా ఉన్నార‌ని తెదేపా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ విమ‌ర్శించారు. మాజీ ఎమ్మెల్యే జ‌నార్ధ‌న్‌రెడ్డి, ఇత‌ర తెదేపా నేత‌ల అరెస్టుల‌ను ఖండిస్తున్న‌ట్లు చెప్పారు. వారిపై బ‌నాయించిన అక్ర‌మ కేసుల‌ను ఉప‌సంహ‌రించుకొని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. తెదేపా నేత బీసీ జ‌నార్ధ‌న్‌రెడ్డి అరెస్టు అప్ర‌జాస్వామికం అని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జ‌గ‌న్ కొవిడ్ క‌ట్ట‌డిని వ‌దిలేసి క‌క్ష సాధింపులకే ప‌రిమితం అయ్యారని ధ్వ‌జ‌మెత్తారు. తెదేపా నేత‌ల‌పై అక్ర‌మంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయ‌డం దుర్మార్గ‌మ‌ని అచ్చెన్న చెప్పారు. అరెస్టు చేసిన నాయ‌కుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలన్నారు. 


 

వైకాపా ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపులే ల‌క్ష్యంగా ప‌ని చేస్తోంద‌ని తెదేపా పొలిట్‌బ్యూరో స‌భ్యుడు న‌క్కా ఆనంద‌బాబు మండిప‌డ్డారు. జ‌నార్ధ‌న్‌రెడ్డి అరెస్టు దుర్మార్గ‌మ‌న్నారు. త‌క్ష‌ణ‌మే అక్ర‌మ కేసులు ఎత్తివేయాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో క‌రోనా విల‌య‌తాండం చేస్తుంటే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను గాలి కొదిలేసింద‌ని మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర ఆరోపించారు. ప్ర‌తిప‌క్షాల‌ను ఇబ్బంది పెట్ట‌డం పైనే ఆలోచ‌న‌లు చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏం త‌ప్పు చేశార‌ని జ‌నార్ధ‌న్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశార‌ని ర‌వీంద్ర‌ ప్ర‌శ్నించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని