ప్రజలపై నమ్మకముంటే సవాల్ స్వీకరించాలి
వైకాపా ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ...
తెదేపా నేతలు చినరాజప్ప, వర్ల రామయ్య
అమరావతి: వైకాపా ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలపై నమ్మకం ఉంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన సవాల్‌ను స్వీకరించాలని ఆ పార్టీ నేత చినరాజప్ప అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మాట మార్చారని మండిపడ్డారు. మాట తప్పినందుకు రాజీనామా చేసి ప్రజల తీర్పును కోరాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారని చినరాజప్ప అన్నారు.
చంద్రబాబు సవాల్ విసిరినా సీఎం జగన్ నుంచి స్పందనలేదని తెదేపా నేత వర్లరామయ్య అన్నారు. తన నిర్ణయంపై సీఎం ప్రజల తీర్పు కోరాలని సూచించారు. చంద్రబాబు చేసిన సవాల్ ను జగన్ స్వీకరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి..
అసెంబ్లీని రద్దు చేయండి: చంద్రబాబు సవాల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు