TDP: మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి.. గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు
రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని తెదేపా బృందం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకెళ్లింది.

విజయవాడ: రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని తెదేపా బృందం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకెళ్లింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, మాజీ మంత్రులు ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర తదితరులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బలహీనవర్గాలపై దాడులు జరిగాయన్నారు.
రాయలసీమలో మైనార్టీలపై దాడుల అంశాన్ని గువర్నర్‌కు వివరించామన్న అచెన్నాయుడు.. ఈ అంశంపై కమిటీ వేసి విచారణ చేపట్టాలని కోరామన్నారు. లోకేశ్ పాదయాత్రలో వైకాపా నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. పోలీసుల వైఖరి, తదితర అంశాలను గవర్నర్ దృష్టికి తెచ్చినట్టు తెదేపా నేతలు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు