
Updated : 29 Jan 2022 15:38 IST
Andhra news : జగన్ గారూ.. అక్కాచెల్లెమ్మలపై ఆప్యాయత ఎక్కడికి పోయింది?: లోకేశ్
విజయవాడ: రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. ‘అక్కా చెల్లెమ్మలపై కురిపించిన ఆప్యాయత ఎక్కడికి పోయింది జగన్ గారూ?’ అని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డలపై అకృత్యాలు పెరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు. ‘మద్యపాన నిషేధం’ వరమిస్తున్నానని గతంలో చెప్పిన సీఎం.. ప్రభుత్వంతోనే మద్యం విక్రయించడంపై ఏం సమాధానం చెబుతారని విమర్శించారు. మహిళలపై అకృత్యాలకు నిరసనగా.. ఈ నెల 31న తెదేపా కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళా ఆధ్వర్యంలో నిర్వహించనున్న నారీ సంకల్ప దీక్షకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు లోకేశ్ ప్రకటించారు. భద్రత.. భవిష్యత్ కోసం మహిళలు సాగించే పోరాటానికి అండగా ఉంటానన్నారు.
Tags :