TDP: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థిని దించే యోచనలో తెదేపా!

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) పోటీ చేసేందుకు తెదేపా(TDP) సిద్ధమవుతోంది. ఈ విషయంపై పార్టీ ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.  

Updated : 09 Mar 2023 14:42 IST

అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) పోటీ చేసేందుకు తెదేపా(TDP) సిద్ధమవుతోంది. అభ్యర్థిని పోటీకి దించాలని భావిస్తోంది. ఈ విషయంపై పార్టీ ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ స్థానానికి పంచుమర్తి అనూరాధ పేరును పరిశీలిస్తున్నట్లు తెదేపా వర్గాల సమాచారం.

ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 13తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని నిలిపే అంశంపై నేతలతో చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. ఒక్కో స్థానంలో అభ్యర్థి గెలవాలంటే 22 నుంచి 23 ఓట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం తెదేపా తరఫున 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వారిలో నలుగురు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి వైకాపాకు మద్దతు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని