Darapaneni Narendra: తెదేపా మీడియా ఇన్‌ఛార్జి నరేంద్రకు బెయిల్‌ మంజూరు

తెదేపా మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రబాబుకు బెయిల్‌ లభించింది. అర్ధరాత్రి 2 గంటలకు నరేంద్రను  సీఐడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి వైద్యుల నివేదికను అందించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నరేంద్రకు న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. 

Updated : 14 Oct 2022 08:21 IST

గుంటూరు: తెదేపా మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రబాబుకు బెయిల్‌ లభించింది. గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించి సీఎంఓలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందని వాట్సప్‌ గ్రూపులో పోస్టులు ఫార్వర్డ్‌ చేశారన్న ఆరోపణలతో బుధవారం రాత్రి సీఐడీ అధికారులు నరేంద్రను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు న్యాయమూర్తి ఎదుట హజరుపరిచేందుకు గుంటూరులోని సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం ప్రాంగణానికి తీసుకొచ్చారు. అప్పటికే కోర్టు సమయం ముగిసిపోవడంతో న్యాయమూర్తి ఇంటివద్ద హాజరుపరిచారు. నరేంద్ర వాంగ్మూలం నమోదుచేసుకున్న న్యాయమూర్తి కె.శృతవింద ఆయనకు జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య రాత్రి 10.30 గంటల సమయంలో నరేంద్రను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం ఆయనను న్యాయమూర్తి ఇంటికి పోలీసులు తీసుకొచ్చారు. అర్ధరాత్రి 2 గంటలకు సీఐడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి వైద్యుల నివేదికను అందించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నరేంద్రకు న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని