TDP: వైకాపా దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొందాం? టీడీఎల్పీలో చర్చ

ఏపీ అసెంబ్లీలో స్పీకర్‌ ఏకపక్ష తీరుపై ప్రశ్నించాలని తెదేపా శాసనభా పక్షం నిర్ణయించింది.

Updated : 21 Sep 2023 19:31 IST

అమరావతి: ‘తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం అక్రమం’ అనే అంశంపై అసెంబ్లీలో శుక్రవారం కూడా పట్టుబట్టాలని తెదేపా శాసనసభా పక్షం నిర్ణయించింది. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపైనా చర్చించారు. సభలో గురువారం జరిగిన పరిణామాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశ్లేషించారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని శాసనసభాపక్షం అభిప్రాయపడింది.

శుక్రవారం సభలో స్పీకర్ ఏకపక్ష తీరును ప్రస్తావించాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. సభలో వైకాపా నేతల తీరు చూస్తుంటే భౌతిక దాడులకు దిగే సూచనలు కన్పిస్తున్నాయని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ అంశంపై శుక్రవారం సభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వొచ్చని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఒక వేళ అదే జరిగితే.. తమకు కూడా అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను పట్టుబట్టాలని నేతలకు సూచించారు. స్పీకర్‌ అనుమతి ఇవ్వకుంటే అసెంబ్లీ బయట అయినా ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమవ్వాలని నిర్ణయించారు. శాసన మండలిలోనూ ఇదే అంశంపై తెదేపా ఎమ్మెల్సీలు పట్టుబట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని