AP Assembly: చంద్రబాబు అరెస్ట్‌పై శాసనసభలో తెదేపా ఎమ్మెల్యేల నిరసన

ఏపీ శాసనసభ సమావేశాల మొదటి రోజే తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. ఆ అంశంపై చర్చించాలంటూ తెదేపా వాయిదా తీర్మానం ఇచ్చింది.

Updated : 21 Sep 2023 10:25 IST

అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాల మొదటి రోజే తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. ఆ అంశంపై చర్చించాలంటూ తెదేపా వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై చర్చకు స్పీకర్‌ నిరాకరించడంతో తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు ప్లకార్డులతో వెళ్లి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న తెదేపా సభ్యులపైకి వైకాపా సభ్యులు దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పరిస్థితులతో సభలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్పీకర్‌ సభను కాసేపు వాయిదా వేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని