Ayyannapatrudu: స్పీకర్‌ పదవికి అయ్యన్నపాత్రుడు నామినేషన్‌

ఏపీ శాసనసభ స్పీకర్‌ పదవి కోసం తెదేపా సీనియర్‌ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated : 21 Jun 2024 15:09 IST

అమరావతి: ఏపీ శాసనసభ స్పీకర్‌ పదవి కోసం తెదేపా సీనియర్‌ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్‌ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్ పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు.

మరోవైపు శాసనసభ శనివారానికి వాయిదా పడింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నేడు 172 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాలతో ముగ్గురు ప్రమాణస్వీకారం చేయలేదు. వారిలో పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు, జీవీ ఆంజనేయులు ఉన్నారు. ఆ ముగ్గురితో శనివారం ప్రమాణం చేయించనున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని