Andhra News: సీఎంపై సభాహక్కుల నోటీసు ఇస్తే చర్యలేవీ?: తెదేపా ఎమ్మెల్యేలు

నాటుసారా మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తమను శాసనసభ నుంచి సస్పెండ్‌ చేశారని తెదేపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో

Published : 16 Mar 2022 14:16 IST

అమరావతి: నాటుసారా మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తమను శాసనసభ నుంచి సస్పెండ్‌ చేశారని తెదేపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో రోజురోజుకీ మృతుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని చెప్పారు. ఈ అంశంపై సభలో కనీసం చర్చ కూడా చేపట్టలేదన్నారు. శాసనసభ నుంచి సస్పెండైన అనంతరం మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యేలు అనగాని సత్య ప్రసాద్‌, గద్దె రామ్మోహన్‌, బెందాళం అశోక్‌, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవాని తదితరులు మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం జగన్‌ అబద్ధాలు మాట్లాడారని.. దీనిపై సభాహక్కుల నోటీసు ఇచ్చినా స్పీకర్‌ చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని