TDP: అసెంబ్లీకి రెండో రోజూ పాదయాత్రగా వెళ్లిన తెదేపా ఎమ్మెల్యేలు

దేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండో రోజూ అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ నిరసన తెలుపుతూ తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి అసెంబ్లీ వరకు నడిచివెళ్లారు.

Updated : 22 Sep 2023 14:18 IST

అమరావతి: తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండో రోజూ అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ నిరసన తెలుపుతూ తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి అసెంబ్లీ వరకు నడిచివెళ్లారు. అసెంబ్లీ సమావేశాల రెండోరోజు చంద్రబాబు అరెస్టు అక్రమం అనే అంశంపై పట్టుబడతామని తెలుగుదేశం స్పష్టం చేసింది. అధికారపక్షం ఎంత దుందుడుకుగా వ్యవహరించినా వెనక్కి తగ్గకూడదని.. శాసనమండలిలోనూ ఇలాగే వ్యవహరిస్తామని తెదేపా నేతలు వెల్లడించారు. 

స్కిల్‌ డెవల్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌కు ప్రభుత్వానికి స్పీకర్‌ అనుమతిస్తే తమకూ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని.. సీఎం జగన్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలనే అజెండాతోనే సభకు వెళ్లారు. స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని సభలో లెవనెత్తాలని తెదేపా శాసనసభాపక్షం నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని