AP Assembly: శాసనసభ నుంచి తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమంటూ శాసనసభలో ఆందోళన చేపట్టిన ఆ పార్టీ సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సస్పెండ్‌ చేశారు.

Updated : 21 Sep 2023 11:44 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమంటూ శాసనసభలో ఆందోళన చేపట్టిన ఆ పార్టీ సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సస్పెండ్‌ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. అనంతరం 15 మందిని సస్పెండ్‌ చేయాలంటూ స్పీకర్‌ను ఆయన కోరారు. దీంతో 14 మంది తెదేపా సభ్యులు, వైకాపాకు చెందిన ఉండవల్లి శ్రీదేవిని ఈరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని ప్రకటించారు.  

సస్పెండైన తెదేపా ఎమ్మెల్యేలు

  • కింజరాపు అచ్చెన్నాయుడు
  • నందమూరి బాలకృష్ణ
  • బెందాళం అశోక్‌
  • ఆదిరెడ్డి భవాని
  • గోరంట్ల బుచ్చయ్యచౌదరి 
  • నిమ్మకాయల చినరాజప్ప
  • గణబాబు
  • పయ్యావుల కేశవ్‌
  • గద్దె రామ్మోహన్‌
  • నిమ్మల రామానాయుడు
  • మంతెన రామరాజు
  • గొట్టిపాటి రవికుమార్‌
  • ఏలూరి సాంబశివరావు
  • డోలా బాల వీరాంజనేయస్వామి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని